గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అందరిలోనూ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. 'వన్ మినట్ మోటివేషన్' పేరిట స్ఫూర్తిదాయక విషయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా పలువురు వన్ మినట్ మోటివేషన్ పేరిట ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. గవర్నర్ తమిళిసై కూడా ఇందులో భాగస్వామ్యమై కొన్ని విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. నైపుణ్యాభివృద్ది, నిరంతర ప్రయత్నానికి సంబంధించి రెండు చిన్న కథలతో వీడియోలను పోస్ట్ చేశారు.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గడంపై అనుమానం: బండి సంజయ్