హిందువుల మనోభావాలు దెబ్బతీసే డర్టీ హరి చిత్రాన్ని విడుదల చేయవద్దని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్లో నిరసన సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడ్డ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌ను పరామర్శించారు.
అరాచకం..
లోతుకుంటలోని దేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భానుప్రకాశ్ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. చిత్ర విడుదలను ఆపివేయాలని నిరసన తెలుపుతున్న బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో భాజపా నాయకులపై పోలీసులు అరాచకం చేస్తున్నారని ఆరోపించారు.
భాను ప్రకాశ్ ఛాతిలో, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. దాడికి సంబంధించిన విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లా. వారిపై చర్యలు తీసుకునే విధంగా పోరాడుతా.
-రాజాసింగ్, ఎమ్మెల్యే
ఇదీ చూడండి: గ్రేటర్‌పై గెజిట్ నోటిఫికేషన్ కోసం.. భాజపా కార్పొరేటర్ల పోరు