Goshamahal MLA Rajasingh wife meets Bandi Sanjay: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉపా బాయి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి వచ్చిన ఆమె తన భర్త రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సంజయ్‌ని విజ్ఞప్తి చేశారు. జాతీయ నాయకత్వానికి రాజాసింగ్ ఇంతకుముందే షోకాజ్ నోటీసులపై వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. హిందూధర్మం కోసం పాటుపడుతున్నందుకే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని ఆమె సంజయ్‌తో ఆవేదన వెలిబుచ్చినట్లుగా సమాచారం. అయితే సస్పెన్షన్ ఎత్తివేత అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని సంజయ్ తెలిపినట్లుగా సమాచారం.
అసలేం జరిగింది: ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది.
పార్టీ నుంచి తనను ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే దానికి పూర్తి వివరణ ఇచ్చారు. అయితే భాజపా అధిష్ఠానం దీనిపై సంతృప్తి చెందక అతనిపై ఇంకా సస్పెండ్‌ను కొనసాగించింది. మరోవైపు ఇటీవలే పీడీయార్డ్ రివైజ్ కమిటీ కూడా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ఎత్తివేసేందుకు నిరాకరించింది.
ఇవీ చదవండి: