ETV Bharat / state

'వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనడం హాస్యాస్పదం'​ - గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ తాజా వార్తలు

గణేశ్​ ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల.. అనేక మంది ఇబ్బందులకు గురవుతారని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

goshamahal mla rajasingh fires on government
'వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనడం హాస్యాస్పదం'​
author img

By

Published : Aug 17, 2020, 5:11 PM IST

వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. పండగకు 4 రోజులే ఉందనగా.. ఇలా చెప్పడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. అనేక మంది ఇబ్బందులకు గురవుతారన్న ఆయన.. దూల్‌పేట గణేశ్‌ విగ్రహ తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వినాయక చవితి సందర్భంగా లక్ష మట్టి గణేశ్​ విగ్రహాలను పంచుతామని ప్రకటించిన ప్రభుత్వం.. దూల్​పేటలో తయారైన విగ్రహాలన్నింటినీ కొనుగోలు చేయాలని రాజాసింగ్​ డిమాండ్ చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా పండగను ఇళ్లలోనే జరుపుకోవాలంటున్న ప్రభుత్వం.. బక్రీద్‌కు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. కొవిడ్​ ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని.. అప్పటి వరకు హిందూ పండగలను జరుపుకోనివ్వరా అంటూ ధ్వజమెత్తారు. కరోనాకు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే.. గణేశ్‌ ఉత్సవాలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.

'వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనడం హాస్యాస్పదం'​

ఇదీచూడండి: 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఐఐటీలు దృష్టిసారించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.