వరంగల్‌లో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై... తెరాస కార్యకర్తల దాడిని ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. అర్వింద్ వాహనంపై రాళ్లు, గుడ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మేమూ చేయగలం..
ఇలాంటి పనులు చేయడం తగదని... అనుకుంటే తాము ఇలాంటి దాడులు చేయగలమని రాజాసింగ్ అన్నారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు... ప్రజల్లోకి వెళ్తున్నాయనే భయంతోనే తెరాస ఇలాంటి దాడులకు పాల్పడుతోందని రాజాసింగ్ ఆరోపించారు.