ETV Bharat / state

'ఒక్క ఛాన్స్​ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం' - ghmc polls 2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించినట్లైతే గోల్నాక డివిజన్​ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెరాస అభ్యర్థి దూసరి లావణ్య, శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు. వరద బాధితులకు నష్టపరిహారం డిసెంబర్​ 7నుంచి వస్తుందని తెలిపారు.

golnaka trs member said Give it a chance we will develop and show
'ఒక్క ఛాన్స్​ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం'
author img

By

Published : Nov 29, 2020, 2:32 PM IST

అంబర్​పేట్​ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది.. అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గోల్నాక డివిజన్ తెరాస అభ్యర్థి దూసరి లావణ్య, శ్రీనివాస్ గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. డివిజన్​లో తెరాస అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అభ్యర్థులు పేర్కొన్నారు.

చిన్న చిన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ సిస్టం, తాగునీటి సమస్య, మైనార్టీలకు శ్మాశాన వాటిక వంటి సమస్యలు నెరవేరుస్తామని అన్నారు.

గోల్నాక డివిజన్ నుంచి మొదటిసారిగా తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని ఓటర్లను అభ్యర్థించారు. ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే డివిజన్​లో సమస్యలను తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వరదల తాకిడికి నష్టపోయిన కుటుంబాలకు నష్ట పరిహారం తిరిగి ఏడో తేదీ నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇదీ చూడండి : వారాసిగూడలో అమిత్‌ షా భారీ రోడ్‌ షో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.