ప్రదర్శన తిలకిస్తున్న సైనిక కుటుంబాలు
- 130 ఎంఎం గన్ ఎం-46 చూడటానికి త్రికోణాకారంలోఉంది. శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలదు. పేల్చాలంటే 9 మంది జవాన్లు అవసరం. నిమిషానికి రెండు రౌండ్లు పేల్చవచ్ఛు రష్యా నుంచి దిగుమతి చేసుకొన్న ఇది 1968లో సైన్యంలో చేరింది.
బీఎంపీ యుద్ధ ట్యాంకు.. రహదారి, ఎత్తుపల్లాలున్న ప్రదేశాలతో పాటు నీళ్లలోనూయుద్ధ ట్యాంకు వెళ్లగలదు. సోవియట్ యూనియన్‌కు చెందిన ఈ ట్యాంకు 1966లో భారత సైన్యంలో చేరింది. కమాండర్, డ్రైవర్, గన్నర్‌తో పాటూ మరో 8 మంది సైనికులు ఇందులో ప్రయాణించొచ్చు. 73 ఎంఎం బ్యారల్ ఉంటుంది. 40 రౌండ్లు పేల్చవచ్చు.
ఎక్కడ?
పరేడ్‌గ్రౌండ్స్ ఈస్ట్‌గేట్ (జేబీఎస్ మార్గంలో) ఉదయం 9 గంటల నుంచి.. ఎవరైనా సందర్శించొచ్ఛు.
క్షిపణులు..
- ప్రదర్శనలో ఆధునాతన యాంటీ ట్యాంకు గైడెడ్ మిసైల్స్‌ను చూపించనున్నారు. దీన్ని ఏటీజీఎంగా పిలుస్తుంటారు. శత్రువులపై 25 మీటర్లు మొదలు 2 కి.మీ. దూరం వరకు ప్రయోగించవచ్చు. నిమిషానికి మూడు మిసైల్స్‌ను వదలొచ్చు.
నిఘాకు దొరికేలా..
- శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు అధునాతన సర్వెలెన్స్ వ్యవస్థలను సైన్యం ఉపయోగిస్తోంది. రేడియో ట్రాక్ సిస్టమ్స్, వెహికల్ రోడ్ టర్మినల్ వ్యవస్థల సాయంతో రాడార్ల ద్వారా సైనికులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
- రాత్రిపూట చిమ్మచీకట్లోనూ 1.5 నుంచి 3 కి.మీ. దూరం నుంచి ఎవరైనా వెళుతుంటే థర్మల్ ఇమేజర్ ద్వారా గుర్తించే వ్యవస్థలను సైన్యం ఉపయోగిస్తోంది.
- వాహనంపై రాడార్ సర్వెలెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. డీఆర్‌డీవో అభివృద్ధిచేసిన దీంట్లో స్కానర్, టెలిస్కోప్ ఉంటుంది.
మిషన్ గన్స్...
- 1.8 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే గన్నులను ప్రదర్శనకు ఉంచారు. మీడియం మిషన్ గన్ బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్నారు.
- రష్యా తయారీ అయిన 30ఎంఎం ఏజీఎల్ సైతం 1.7 కి.మీ. దూరం వరకు లక్ష్యాన్ని గురిపెడుతోంది. 30 కిలోల బరువు ఉంటుంది. నేలపై నుంచి పేల్చాలి.
- భారత్‌లోనే తయారైన 5.56 ఇన్సాస్ ఆర్‌ఐఎఫ్ గన్ 700 మీటర్ల దూరం లక్ష్యంపై గురిపెట్టొచ్చు.
నేటి సాయంత్రం 4 నుంచి..
1971 యుద్ధ వీరులకు సన్మాన కార్యక్రమం గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఇందుకోసం బుధవారం ఆర్మీ బ్యాండ్ ప్రదర్శన, ఆయుధాల ప్రదర్శన, హెలికాప్టర్‌తో రిహార్సల్స్ నిర్వహించారు.
- ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకూ జడ్డూ దూరం!