సికింద్రాబాద్లోని పుట్టింటికి వెళ్ళిన భార్యను తీసుకొచ్చేందుకు భర్త ఇంటికి తాళమేసి వెళ్లిన వెంటనే చోరీ జరిగిన ఘటన బోయిన్ పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. దంపతులు ఇంటికి చేరేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోని సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితులు.
అవన్నీ మాయం..
నివాసంలోని 4 తులాల బంగారంతో పాటు 20,000 నగదును దుండగులు ఎత్తుకెళ్లారని గృహ యాజమాని ఆందోళన వ్యక్తం చేశాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లి మల్లికార్జున్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న క్లూస్ టీం.. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : అప్పు చెల్లించమంటే.. కత్తితో నరికాడు