కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదనీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారెజీలో 85 గేట్లకు గాను 70 గేట్లు మూసేశారు. వరద ప్రవాహంతో బ్యారెజీలో నీటి నిల్వ 91.6 మీటర్లకు పెరిగింది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 1, 3, 6 మోటార్లతో పాటు అధికారులు నాలుగో మోటార్‌ను కూడా ప్రారంభించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో నడుస్తున్న నాలుగు మోటర్ల ద్వారా ఎత్తిపోస్తున్న నీరు గ్రావిటీ ద్వారా 13.5 కి.మీ. ప్రవహించి అన్నారం బ్యారెజీలోకి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలో నీటి నిల్వ 2 టీఎంసీలకు చేరింది.
ఇవీ చూడండి: కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు