కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు (GRMB Subcommittee). బోర్డు మీటింగ్ మినిట్స్‌తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
బోర్డు సభ్యులు ఇద్దరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అంతర్ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు, రెండు జెన్‌కోల నుంచి ఒక్కో అధికారి సభ్యులుగా ఉంటారు. నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు సమన్వయం చేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: Ministry of Jal Shakti : 'కృష్ణా, గోదావరి'ని ఏం చేద్దాం? కేంద్రం తర్జనభర్జన!