రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని భారత దళిత పరిశ్రమ సమాఖ్య (సీఐడీఐ) జాతీయ అధ్యక్షులు ఎర్రతోట రాజశేఖర్ పేర్కొన్నారు. జీవో నెం.59 అమలు కావడం లేదంటూ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని.. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, హైదర్‌గూడలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మట్లాడారు.
ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు తీసుకొచ్చిన జీవో నెం.59 ద్వారా వందలాది మంది తాపీమేస్త్రీలు.. కాంట్రాక్టర్లుగా ఎదిగారని రాజశేఖర్ గుర్తుచేశారు. ఈ జీవో ద్వారా కాంట్రాక్టు పనుల్లో.. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం రిజర్వేషన్‌ను కల్పించిందని వివరించారు.
జీవో నెం.59ను ప్రభుత్వం అన్ని శాఖల్లో.. 80శాతం వరకు అమలు చేస్తోందని రాజశేఖర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, తదితర కారణాల వల్ల.. కొన్ని శాఖల్లో మాత్రం అమలు కావడంలేదని వివరించారు. ఆయా శాఖల్లోనూ త్వరలోనే అమలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'ఎస్సీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు'