ETV Bharat / state

మిస్​ కాల్​ ఇస్తే చాలు.. ఇంటి వద్దకే పండ్లు

లాక్​డౌన్​ కారణంగా ఇటీవల బంతి, వంగ, టమాట పండించిన రైతులు పలు చోట్ల పలు విధాలుగా నష్టపోయారు. తాజాగా ఆ ఎఫెక్టు పండ్ల రైతులపై కూడా పడుతోంది. దానిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లవద్దకే పండ్లు అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. అది సక్సెస్​ కావడం వల్ల మరో ముందడుగు వేసింది.

author img

By

Published : Apr 20, 2020, 7:55 PM IST

Give Miss Call Fruits delivered in home in telangana
మిస్​ కాల్​ ఇస్తే చాలు.. ఇంటి వద్దకే పండ్లు
మిస్​ కాల్​ ఇస్తే చాలు.. ఇంటి వద్దకే పండ్లు

ఈ 88753 51555 నంబర్​కు మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటి వద్దకే పండ్లు వస్తాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కావాల్సిన పరిణామం, చిరునామా సంక్షిప్త సందేశం చేసినట్లైతే మీ ఇంటి ముందుకు పండ్లు వస్తాయన్నారు. ఇప్పటికే 30 వేల కుటుంబాలకు తాజా పండ్లు సరఫరా చేశామన్నారు. లాక్‌డౌన్ కారణంగా వాక్ ఫర్ వాటర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ టూ హోం సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జంట నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

30 ఆర్డర్లు ఇస్తే ఇంటికే ఉచిత సరఫరా..

రూ. 300కే మామిడి-1.5 కేజీలు, బొప్పాయి-3 కేజీలు, నిమ్మ-12 కాయలు, పుచ్చకాయలు-3 కేజీలు, బత్తాయి-2 కేజీలు, సపోట-1 కేజీ పండ్లు 72 గంటల వ్యవధిలో ఇంటి ముందుకే తీసుకొస్తారని తెలిపారు. 30 ఆర్డర్లు ఇస్తే ఇంటికే ఉచిత సరఫరా చేస్తారన్నారు. ఒక్కటే ఆర్డరైతే 10 కిలోమీటర్ల పరిధిలో రూ. 10 నుంచి 30 వరకు ఛార్జీ వసూలు చేస్తారన్నారు. రైతుగా రైతుల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్నారు. నాకూ కూడా తెలుసని చెప్పారు.

ప్రతి పండూ రైతులకు అండ..

లాక్‌డౌన్‌తో చేతికొచ్చిన రైతుల పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్నాయని తెలిపారు. ప్రజలు ఖరీదు చేసే ప్రతి పండూ రైతులకు అండగా నిలవటంలో భాగమేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులల్లో రైతులకు-వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డిని మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. దాతలు ముందుకొచ్చి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే వారి తరపున ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధాశ్రమాల్లో సంస్థ తరపున పండ్లు అందజేయవచ్చని చెప్పుకొచ్చారు. పెద్ద మనసు చేసుకుని దాతలు మరింత ముందుకు రావాలని మంత్రి కోరారు.

ఇదీ చూడండి : గులాబీ పూలతో మహిళా సర్పంచ్ వినూత్న అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.