ETV Bharat / state

హీరా కేసు దర్యాప్తు వివరాలు ఇవ్వండి: హైకోర్టు

హీరా గ్రూపుపై దాఖలైన కేసుకు సంబంధించిన దర్యాప్తు ఏ దశలో ఉందో పట్టిక రూపంలో సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2012లో కేసు నమోదైతే... 2018లో అరెస్ట్‌ చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

author img

By

Published : Jul 15, 2019, 11:57 PM IST

హీరా కేసు దర్యాప్తు వివరాలు ఇవ్వండి: హైకోర్టు

దర్యాప్తు దశల పూర్తి వివరాలు సమర్పించండి
తీగలాగితే డొంకే కదులుతోంది...హీరా గ్రూపు కేసులో దర్యాప్తు దశలను పూర్తి వివరాలతో పట్టిక రూపంలో సమర్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2012 నుంచి కేసు దర్యాప్తు జరుగుతున్నప్పటికి పోలీసులు నేటికీ తేల్చకపోవడంపై అనుమాలకు ఆస్కారమిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
16 బోగస్‌ కంపెనీలపై విచారణ
హీరా గ్రూపు అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు సహబాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. హీరా గ్రూప్​ సుమారు 16 బోగస్‌ కంపెనీలను నిర్వహిస్తోందని, ఆర్వోసీ రికార్డుల ప్రకారం ఎలాంటి బోర్డు సమావేశాలు నిర్వహించడం లేదని, వార్షిక రిటర్నులను దాఖలు చేయడం లేదని పిటిషన్‌లో బాధితులు పేర్కొన్నారు.
ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి
ఈ కంపెనీల పేరుతో సుమారు 240 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వీటిలో రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయన్నాయన్నారు. హీరా గ్రూపు కంపెనీలు ప్రజలను మోసగించి రూ.50 వేల కోట్ల దాకా వసూలు చేసిందని బాధితులు పిటిషన్​ తెలిపారు. 2012, 2018, 2019లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు కోర్టుకు వివరించారు.దీనిపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. కంపెనీ ఎండీ నౌహీరా షేక్‌ను అరెస్ట్‌ చేసినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
2012లో కేసు నమోదైతే...2018లో అరెస్టా?
2012లో కేసు నమోదైతే 2018లో అరెస్ట్‌ చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయని, దర్యాప్తు చేసే విషయంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది. అందుకే పిటిషనర్లు సీబీఐ దర్యాప్తునకు కోరుతున్నారని ధర్మాసనం పేర్కొంది. మొత్తం హీరా గ్రూపు కేసుల వివరాలు, వాటి దర్యాప్తు ఏ దశలో ఉందో పట్టిక రూపంలో సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది.

ఇవీ చూడండి: నిజామాబాద్​ రైతు వినూత్న ఆలోచన

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.