ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గిరిజన గ్రామానికి చెందిన గర్భిణిని.. డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. కరకవలస పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన మారిక.. కొండల నడుమ ఉంటుంది. వీరు కనీస అవసరాలు తెచ్చుకోవడానికైనా ఏడు కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది.
గ్రామానికి చెందిన గమ్మెల బిమలకు పురిటినొప్పులు రావడంతో స్థానికులు డోలి కట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే నొప్పులు ఎక్కువై ప్రసవించింది. ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీబిడ్డలను మోసుకుంటూ తీసుకెళ్లి.. ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: వేధింపుల కాల్‌తో బయటపడ్డ అతిపెద్ద సైబర్‌క్రైం..!