మొండి బకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైం సెటిల్మెంట్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది మార్చి వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయి వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ నెల 15 తేదీ నుంచి సెప్టెంబర్ 15 తేదీ వరకు వీటిని చెల్లిచేందుకు వెసులుబాటు కల్పించింది.
గ్రేటర్ హైదరాబాద్‌తో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేన్లలో ఏళ్లుగా ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఆస్తి పన్ను కంటే వడ్డీలే భారీగా పేరుకపోవడం వల్ల పన్నులు కట్టేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆస్తి పన్నుల వసూళ్ల కోసం వన్ టైం సెటిల్ మెంట్ స్కీంను తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని బకాయిదారులకే లబ్ధి చేకురనుంది. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు బల్దియా ప్రణాళికలు రచిస్తోంది.
వన్ టైమ్ స్కీం కింద 2019-20 వరకున్న ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. కేవలం 10 శాతం వడ్డీతో పాటు ఆస్తి పన్ను చెల్లించాలని బల్దియా చూస్తోంది. ఈ పథకాన్ని ఈ నెల 15 తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు అమలు చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మార్చి 2020 వరకు 14 వందల 7 7 కోట్ల రూపాలయల ఆస్తి పన్ను అసలు, వెయ్యి 17 కోట్ల వడ్డీ బకాయిలు ఉన్నాయి. వన్ టైమ్ స్కీంతో గ్రేటర్ పరిధిలో 5 లక్షల 41 వేల 10 ప్రాపర్టీల యజమానులకు ప్రయోజనం కలుగనుందని లెక్కలు తేల్చింది. ఎల్బీ నగర్ జోన్లో 75 వేల 305, చార్మినార్ జోన్లో లక్ష 34 వేల 650, ఖైరతాబాద్ జోన్లో లక్షా 8 వేల 617, శేరిలింగంపల్లి జోన్లో 40 వేల 790, కూకట్ పల్లి జోన్లో 81 వేల 408, సికింద్రాబాద్ జోలో లక్ష 240 మంది యాజమానులు ఈ పథకం కింద ఆస్తి పన్ను లు చెల్లించాలని జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ప్రభుత్వం కల్పించిన వన్ టైమ్ స్కీం ప్రయోజనాలు అందించుటకు జీహెచ్ఎంసీ విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. మై జీహెచ్ఎంసీ మొబైల్ అప్లికేషన్, జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో ఆస్తి పన్ను చెల్లించే అవకాశాన్ని కల్పించారు. అందుబాటులో వున్న ఆసిపన్నుబకాయిదారుల మొబైల్ నెంబర్లకు 90 శాతం వడ్డీ రాయితీ వెసులుబాటు గురించి సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. వీటితో పాటు జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలతో పాటు బిల్ కలెక్టర్లకు చెల్లింపులు చేయవచ్చని బల్దియా వెల్లడించింది. వన్ టైమ్ స్కీం అమలుపై జోనల్, డిప్యూటీ కమీషనర్లు, బిల్ కలెక్టర్లు ఎప్పటికప్పులు పర్యవేక్షించనున్నారు. దీంతోనైనా పాత బకాయిలు పూర్తిస్థాయిలో వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..