ETV Bharat / state

త్వరలో బొకేలకు ప్లాస్టిక్​ వాడకంపై నిషేధం

పుష్పగుచ్చాలకు ప్లాస్టిక్​ చుట్టడాన్ని నిషేధించాలని హైదరాబాద్​ మహా నగర పాలక సంస్థ నిర్ణయించింది. త్వరలో దీనిపై పూర్తిస్థాయి నియమ నిబంధనలను రూపొందించాలని స్టాండింగ్​ కమిటీకి ఆదేశించారు. కమిషనర్​ దాన కిశోర్​ నగరంలోని ఫ్లోరిస్ట్​లతో సమావేశాన్ని నిర్వహించారు.

త్వరలో బొకేలకు ప్లాస్టిక్​ వాడక నిషేధం
author img

By

Published : Aug 17, 2019, 1:16 PM IST

హైదరాబాద్​లో పలు ఫంక్షన్లు, వేడుకలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా అందజేసే పూలగుచ్చాలకు ప్లాస్టిక్ కవర్లు చుట్టడాన్ని నిషేధించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ పూలబొకేలకు చుట్టే ప్లాస్టిక్ కవర్లు 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండి పర్యావరణానికి తీవ్ర ముప్పుగా ఏర్పడుతున్నాయి. పూలగుచ్చాలకు ప్లాస్టిక్ పేపర్లను చుట్టడంపై త్వరలోనే పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. ఇందుకోసం నగరంలోని బొకేలు​ తయారు చేసే ఫ్లోరిస్ట్​లతో సమావేశాన్ని నిర్వహించారు. బొకేలకు వాడే ప్లాస్టిక్ కవర్లు నాలాలు, చెరువుల్లో చేరి పర్యావరణానికి ముప్పుగా మారాయని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ కవర్లకు బదులుగా అందమైన క్లాత్​లు, పేపర్, జనపనార, బయోడ్రిగేడబుల్ కవర్లనే బొకేలకు చుట్టాలని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్​లో పరిధిలో దాదాపు 500 పూలబొకేల విక్రయ దుకాణాలు ఉన్నాయని అంచనా వేసినట్టు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయి నియమ నిబంధనలు రూపొందించి ఆమోదానికై స్టాండింగ్ కమిటిలో అనుమతి పొందనున్నట్టు దానకిషోర్ తెలిపారు.

త్వరలో బొకేలకు ప్లాస్టిక్​ వాడక నిషేధం

ఇదీ చూడండి: పటాన్​చెరులోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.