హైదరాబాద్ మహానగరంలో 267 మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉంచామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. 16 డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం వల్ల నీరు రోడ్లమీదకు వచ్చింది. కేబీఆర్ పార్కు వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది చేస్తున్న సహాయక చర్యలను మేయర్ పరిశీలించారు.
ముందస్తు చర్యలు
నగరంలోని 53 మేజర్ నాలాలను క్లీన్ చేశాం. మ్యాన్స్ హోల్స్‌కు ఒక జీహెచ్ఎంసీ సిబ్బందిని నియమించాం. ప్రజలు ఎవరు మ్యాన్ హోల్స్ ముట్టుకొవద్దు. ఎక్కువగా నీరు నిలిచే 30 ప్రాంతాలను గుర్తించి అక్కడ నీటిని తోడెందుకు 10 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేశాం. 70 జేసీబీలను కూడా అందుబాటులో ఉంచాం. వర్షానికి చెట్లు పడిన 10 ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే తొలగించాయి.
-బొంతు రామ్మోహన్, మేయర్
గత మూడేళ్లుగా నగరంలోని 1500 శిథిల భవణాలను కూల్చివేశామని... ఇంకా 200 శిథిల భవణాలను గుర్తించామని అవి కూడా త్వరలో కూల్చివేస్తామని పేర్కొన్నారు.