జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ హైదరాబాద్ జంట నగరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై ఆకస్మిక తనిఖీలు చేశారు. కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మలక్ పేట, మూసరంబాగ్ బ్రిడ్జ్ వద్ద పేరుకుపోయిన చెత్తను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆ చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
అంబర్ పేట అలీ కేఫ్ వద్ద, అన్నపూర్ణ నగర్, వేంకటేశ్వర నగర్, జిందా తిలిస్మాత్ రోడ్డులో చెత్త ఆటో రావడం లేదని స్థానికులు మేయర్ విజయ లక్ష్మీకి ఫిర్యాదు చేశారు. వెంటనే నిర్వాహకులకు ఫోన్ చేసి వారిని రప్పించారు. చెత్త సేకరణను కచ్చితంగా చేపట్టాలని తెలిపారు. 50 ఏళ్లు దాటిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో వారు కోరుకుంటే.. వారి కుటుంబ సభ్యులను నియమించే విధంగా చూడాలని ఆధికారులకు మేయర్ సూచించారు. గోల్ నాక, కాచిగూడ, ఖైరతాబాద్ చింతల్ బస్తీ, బంజారహిల్స్ దేవరకొండ బస్తీ పలు చోట్ల ప్రైవేట్ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం గమనించిన మేయర్... త్వరలో వీటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో