హైదరాబాద్ జియాగూడలోని పేదలకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. జియాగూడ రంగనాథ స్వామి దేవాలయ ప్రధానార్చకుడు శేషాచారి, బంకట్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో... మేయర్ పాల్గొని 200 మందికి సరుకులను అందజేశారు. ఈనెల 23వ తేదీ నుంచి నేటివరకు సుమారు 27 వేల మంది పేదలకు నిత్యావసరాలను పంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపి లేక రోగుల విలవిల