ETV Bharat / state

వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్​ఎంసీ అప్రమత్తం - హైదరాబాద్​ మహా నగర పాలక సంస్థ

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జంటనగరాల ప్రజలకు ముంపుతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా కసరత్తు ప్రారంభించింది. భారీ వ‌ర్షాల‌ కారణంగా ఎదుర‌వుతున్న విపత్తులను అధిగ‌మించేందుకు రోడ్ల మ‌ర‌మ్మతులు, నాలాల పూడికతీత, ఆధునికీక‌ర‌ణ‌, విస్తర‌ణ ప‌నుల‌ను యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తోంది. వ‌ర్షపు నీటిలో ప్లాస్టిక్‌, ఇత‌ర వ్యర్థాలు చేరడం వల్ల నాలాలు, డ్రెయిన్లలోకి నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయి పరిసర ఆవాసాల‌కు ఇబ్బందిగా మారుతోంది. నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా డ్రైనేజీల ద్వారా నాలాలోకి నీరు ప్రవ‌హించేలా ప్రజ‌లు సహకరించాలని జీహెచ్ఎంసీ సూచించింది. ప్లాస్టిక్‌, చెత్తను రోడ్లు, నాలాల్లో వేయొద్దని మరోసారి విజ్ఙప్తి చేసింది.

ghmc mansoon action plan to solve problems in greater hyderabad
వర్షాకాలం నేపథ్యంలో బల్దియా అప్రమత్తం
author img

By

Published : Jun 5, 2020, 9:44 PM IST

వర్షాకాలం మొదలైంది. బల్దియా అప్రమత్తమైంది. హైదరాబాద్​లో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం కావడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావటం ప్రతి ఏటా సాధారణంగా మారింది. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వ‌ర్షపునీరు సుల‌భంగా ప్రవ‌హించేందుకు అనువుగా నాలాల్లో ఉన్న పూడిక‌ను తొల‌గించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వార్షిక ప్రణాళిక‌ను అమ‌లుచేస్తోంది. వర్షాకాలం ముందు, వ‌ర్షాకాలం త‌ర్వాత చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంది. లోత‌ట్టు ప్రాంతాలు, రోడ్ల ప‌క్కన‌, రోడ్లపైన వ‌ర్షపునీరు నిలిచిపోకుండా, డ్రెయిన్లు, నాలాల ద్వారా సుల‌భంగా నీరు వెళ్లిపోయేందుకు అనువుగా ప‌నుల‌ను చేప‌ట్టింది. అందులో భాగంగా ఈ ఏడాది 43.38 కోట్ల వ్యయంతో 4.79 ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గించాలని నిర్ణయించింది. అందులో ఇప్పటి వ‌ర‌కు 702 కిలోమీట‌ర్లలో 3.75 ల‌క్షల క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గించారు. మ‌రో వారం రోజుల్లో వ‌ర్షాకాలం ముందు నిర్దేశించిన మేర‌కు పూడిక‌ను తొల‌గించ‌నున్నట్లు అధికారులు వెల్లడించారు.

వర్షపు నీటిని తొలగించేందుకు బృందాలు

వ‌ర్షాకాలంలో ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను అధిగ‌మించుట‌కు ముంపుకు గుర‌య్యే లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు రోడ్లపై నిలిచిన వ‌ర్షపునీటిని త‌క్షణ‌మే స్పందించి తొల‌గించుట‌కు స‌మ‌స్యాత్మక ప్రదేశాల్లో 89 స్టాటిక్ బృందాల‌ను, 118 మినీ మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు, 79 మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను బల్దియా నియ‌మించింది. ఈ బృందాలు 24గంట‌ల పాటు ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉంటారు. అలాగే క్షేత్రస్థాయి అధికారులు, బృందాల‌తో స‌మ‌న్వయం చేసేందుకు ఒక జోన‌ల్ ఎమ‌ర్జెన్సీ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిలిచిన‌ వ‌ర్షపు నీటిని నాలాలు, డ్రెయిన్లలోకి పంపేందు‌కు 202 మోట‌ర్ పంపుల‌ను అందుబాటులో ఉంచారు.

నీటిని సంరక్షించుటకు ఇంజక్షన్​ బోర్​వెల్స్​

ఈ బృందాల‌కు తోడు పూర్తి ఆధునిక సాధ‌న సంప‌త్తితో 16 డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. స‌మ‌స్యాత్మకంగా ఉన్న 195 నీటి ముంపు ప్రాంతాల‌ను గుర్తించి 157 చోట్ల ప‌నుల‌ను పూర్తిచేశారు. 38 ప్రాంతాల్లో ఇత‌ర శాఖ‌ల‌కు చెందిన అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. వ‌ర్షపునీటిని సంర‌క్షించుట‌కు, భూగ‌ర్భ జ‌లాల పెంపుద‌ల‌కు జేఎన్​టీయూ నిపుణులు ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు నగరంలో 44 చోట్ల ఇంజ‌క్షన్ బోర్ వెల్స్‌ను గతంలో ఏర్పాటు చేశారు. భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు ఆ నీటిని ఇంజ‌క్షన్ బోర్‌వెల్స్‌లోకి అధికారులు మ‌ళ్లిస్తున్నారు. వ‌ర‌ద ముంపును నివారించుట‌కు 2019లో రూ. 102 కోట్లతో 439 చోట్ల ప‌నులు చేప‌ట్టారు.దీంతో నాలాల ఆధునీక‌ర‌ణ చేసి జ‌న‌స‌మ్మర్థం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఇరుకుగా ఉన్న చిన్న చిన్న నాలాల్లోకి చుట్టుప‌క్కల ఇళ్లు, రోడ్ల నుంచి వ‌చ్చిన వ‌ర‌ద‌నీరు సుల‌భంగా ప్రవ‌హించి ప్రధాన నాలాల్లోకి మ‌ళ్లించారు.

రోడ్ల మరమ్మతులు

రోడ్లపై ఉన్న గుంత‌ల్లో వ‌ర్షపునీరు నిలిచి ఏర్పడే ఇబ్బందుల‌ను అధిగ‌మించుట‌కు 2019లో రూ. 596 కోట్లతో 1968 చోట్ల ప‌నులు చేప‌ట్టి 928 కిలోమీట‌ర్ల రోడ్ల మ‌ర‌మ్మతులు చేశారు. ఏప్రిల్ 2020 నుంచి ఇప్పటి వ‌ర‌కు రూ. 22కోట్లతో 23 చోట్ల ప‌నులు చేప‌ట్టి 48 కిలోమీట‌ర్ల రోడ్ల మ‌ర‌మ్మతులు పూర్తి చేశారు. వీటితో పాటు 709 కిలోమీట‌ర్ల ప్రధాన రోడ్ల నిర్వహ‌ణ బాధ్యత‌ను ఏజెన్సీల‌కు అప్పగించ‌డంతో ఆ మార్గాల్లో వ‌ర‌ద ముంపును నివారించుట‌కు రీకార్పెటింగ్‌, ఇత‌ర మ‌ర‌మ్మతుల‌ను చేప‌ట్టారు.

ఇవీ చూడండి: ఓయూ భూములపై గవర్నర్​ను కలిసిన కోదండరాం, చాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.