జూన్ 6 నుంచి జీహెచ్‌ఎంసీ అసెట్స్ ప్రొటెక్షన్ సెల్ (ఏపీసీ) సేవలు మొదలు కాగా ఆగస్టు నెలాఖరు వరకు 281 ఫిర్యాదులు అందాయి. అందులోని 95 శాతం ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ పూర్తయింది. నగరంలో చెరువులు, ఖాళీ స్థలాలు, పార్కులను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చందానగర్ సర్కిల్ పరిధిలోని గౌతమి నగర్‌లోని పార్కు స్థలంలో అక్రమంగా చేపట్టిన రెండు నిర్మాణాలను, కేపీహెచ్‌బీ ఫేజ్-3 పార్కులోని ఇంటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూల్చేశారు. త్వరలో మరిన్ని కూల్చివేత చర్యలు ఉంటాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో ఉమ్మడి తనిఖీలు పూర్తయ్యాక చెరువుల ఆక్రమణలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు.
ఫిర్యాదు చేయండిలా..
ప్రభుత్వ స్థలాల ఆక్రమణల గురించి టోల్ ఫ్రీ నంబరు.. 18005990099ను సంప్రదించి వివరాలు ఇవ్వొచ్చు. పని దినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. ఫిర్యాదుదారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా