హైదరాబాద్ బోరబండలో తెరాస పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో సంఘాల ప్రతినిధులు డిప్యూటీ మేయర్ బాబ ఫసుద్దీన్ను సన్మానించారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను వ్యతిరేస్తూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో తీర్మానించడం గర్వించదగ్గ విషయమని వారు కొనియాడారు. ఈ తీర్మానానికి హర్షం వ్యక్తం చేస్తూ.. తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ముస్లింలకు మనోధైర్యం కలిగించేందుకే కౌన్సిల్లో ఈ తీర్మానం చేసినట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు. ముస్లింలు ఎవరికీ వ్యతిరేకం కాదని... హిందూ ముస్లింలు ఒక్కటేనన్నారు.
ఇదీ చూడండి: అమ్మ గురించి ఆలోచించండి!