ETV Bharat / state

GHMC Swachh autos: గ్రేటర్​లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు.. మరో 1,350 స్వచ్ఛ ఆటోలు.! - swachh autos for hyderabad

హైదరాబాద్ జంట నగరాల్లో మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలని జీహెచ్ఎంసీ(GHMC Swachh autos) నిర్ణయించింది. ఇప్పుడందిస్తున్న సేవలను మరింత పొడిగించాలని భావిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా ఏటా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సేవలు కూడా నూతన ఏరియాల్లో చివరి ఇళ్ల వరకు అందించాలని బల్దియా(GHMC Swachh autos) నిర్ణయించింది. అందులో భాగంగా ఇంటింటికీ చెత్తను సేకరించేందుకు నూతనంగా మరిన్ని స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసింది. మరో 1,350 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

auto tippers for swachh hyderabad
జీహెచ్​ఎంసీకి స్వచ్ఛ ఆటోలు
author img

By

Published : Oct 31, 2021, 5:17 PM IST

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్య సేవల కోసం మరో 1,350 స్వచ్ఛ ఆటోల(GHMC Swachh autos) పంపిణీకి సిద్ధం చేశారు. జంట నగరాలు దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న స్వచ్ఛ ఆటోలు సరిపోవడం లేదు. దీంతో ప్రతి రోజూ 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరం మేరకు స్వచ్ఛ ఆటోల పంపిణీ(GHMC Swachh autos)కి చర్యలు చేపట్టింది బల్దియా.

డ్రైవర్​ కం ఓనర్​

జీహెచ్ఎంసీ(GHMC Swachh autos) పరిధిలో 2015లో 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికీ వెళ్లి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించారు. స్వచ్ఛ ఆటో ట్రిప్పర్ల ద్వారా 2016 లో ప్రతి రోజూ 3,500 టన్నులు, 2017లో 4,500 వ్యర్థాలను సేకరించారు. ఈ నేపథ్యం లో 3.3 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల మరో 650 స్వచ్ఛ ఆటోలను డ్రైవర్ కమ్​ ఓనర్ పథకం క్రింద రెండో సారి పంపిణీ చేశారు.

బ్యాంకు ద్వారా రుణాలు

ఈ వాహనాల్లో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తారు. ప్రతి రోజూ ఒక్కొక్క వాహనం 1.5 మెట్రిక్ టన్నుల చెత్తను కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఇంటింటికీ(GHMC Swachh autos) వెళ్లి సేకరించనుంది. గతంలో ఉన్న 3,150 స్వచ్ఛ ఆటోలకు అదనంగా అవసరాన్ని బట్టి మరో 1,350 స్వచ్ఛ ఆటోల(GHMC Swachh autos)ను డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా పంపిణీ చేయనున్నారు. 10 శాతం వాటా లబ్ధిదారులు చెల్లించాలి. మిగతా 90 శాతం సొమ్ము(GHMC Swachh autos)ను బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారు. ఈ ఆటోలు కూడా గతంలో కొనుగోలు చేసిన 650 ఆటోల మాదిరిగా ఉండనున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ 450 గృహాల నుంచి చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తారు.

ఇదీ చదవండి: Etela Rajender: పోలింగ్ సిబ్బందికి డబ్బులు పంచారు.. చివరికి ఈవీఎంలు సైతం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.