గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆస్తి పన్ను బకాయిదారులు వన్‌టైం స్కీంను సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ కోరారు. ఆస్తి పన్ను బకాయిదారుల మొబైల్ నంబర్లకు 90శాతం వడ్డీ రాయితీ వెసులు బాటు గురించి సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాలతో పాటు.. బిల్ కలెక్టర్లకు చెల్లింపులు చేయవచ్చన్నారు.
వన్ టైమ్ స్కీంతో నగరంలో మొత్తం 5 లక్షల 41 వేల ప్రాపర్టీల యజమానులకు ప్రయోజనం కలుగనుందని కమిషనర్ తెలిపారు. ఎల్బీనగర్ జోన్లో 75 వేలు, చార్మినార్ జోన్లో లక్ష 34 వేలు, ఖైరతాబాద్ జోన్లో లక్ష 8 వేలు, శేరిలింగంపల్లి జోన్లో 40 వేలు, కూకట్ పల్లి జోన్లో 81 వేలు, సికింద్రాబాద్ జోన్లో లక్ష మంది యాజమానులు వన్ టైమ్ స్కీం కింద బకాయిదారులు ఉన్నట్లు పేర్కొన్నారు.