హైదరాబాద్ నగరంలో అక్రమ, అనధికార నిర్మాణాల విషయంలో కోర్టు ఉత్తర్వులను పక్కాగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈనెల 10 వరకు గడువు
బల్దియా పరిధిలోని 30 సర్కిళ్లలోని కోర్టు కేసుల అంశాలను సమీక్షించారు. కోర్టు ఉత్తర్వులను పూర్తిగా అమలుచేసి ఈ నెల 10లోపు చర్యల నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవనాల ఫోటోలు, వీడియోలను ఆధారంగా తీసుకొని అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసేందుకు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలని సూచించారు.
ఇవీ చూడండి: వీడియోకు లైక్ కొట్టిన పాపానికి రూ.2.04 లక్షలు చెల్లించాడు