ETV Bharat / state

'జీహెచ్​ఎంసీ ఎన్నికలపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు' - hyderabad district update news

జీహెచ్​ఎంసీ ఎన్నికల అంశంపై వస్తున్న గందరగోళ ప్రచారాలను నమ్మవద్దని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​కుమార్​ తెలిపారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ghmc commissioner lokesh kumar on  elections issue
'జీహెచ్​ఎంసీ ఎన్నికలపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు'
author img

By

Published : Nov 5, 2020, 7:04 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరుగుతుందని ఎన్నికల అధికారి జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​కుమార్​ స్పష్టం చేశారు. ఎన్నికల అంశంపై గందరగోళం కలిగించే విధంగా వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. 2016 ఎన్నికల్లో అమలు చేసిన డివిజన్​లు, రిజర్వేషన్​లలో ఎలాంటి మార్పులు ఉండవని అవే యథావిధిగా కొనసాగుతాయని లోకేష్​కుమార్​ వెల్లడించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మార్గదర్శకాలకు లోబడి ఈ ఏడాది జరిగిన స్పెషన్​ సమ్మరీ రివిజన్​ ఆధారంగా ఎన్నికల ఓటరు జాబితా రూపొందుతుందని.. ఆ మేరకే ఈసారి కూడా జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడేంత వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారందరూ జీహెచ్​ఎంసీ ఓటరు జాబితాలో ఉంటారని తెలిపారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల నిర్వహణ అంశంపై అనధికార వార్తలను విశ్వసించవద్దని లోకేష్​కుమార్​ మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండిః 'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.