హైదరాబాద్‌లో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు సేకరిస్తున్నామని.. ఇప్పటి వరకు నగరంలో 13 వేల మంది విదేశాల నుంచి వచ్చారన్నారు. వారందరికీ క్వారైంటెన్ స్టాంప్స్ వేయనున్నట్లు వెల్లడించారు. స్టాంప్ వేసిన తర్వాత క్వారంటైన్లో ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తామన్నారు.
రేపు పారిశుద్ధ్య సిబ్బంది యథావిధిగా విధులు నిర్వహిస్తారని.. నగర ప్రజలు జనతా కర్ఫ్యూ లో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇప్పటికే ప్రధాన ఏరియాల్లో సోడియం, పైతో క్లోరైడ్‌తో స్ప్రేయింగ్ చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలుంటే వెంటనే 108 కాల్ చేయాలని... ప్రత్యేక సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 10వేలకు చేరిన మరణాలు