ETV Bharat / state

శిథిల భవనాల కూల్చివేతకు సహకరించాలి:లోకేశ్​కుమార్​ - హైదరాబాద్​లో శిథిల భవనాల కూల్చివేత వార్తలు

వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు నగరంలోని శిథిల భవనాల కూల్చివేతకు ప్రజలు సహకరించాలని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​ పేర్కొన్నారు. కూల్చివేతల్లో నిరాశ్రయులైన వారిని కమ్యూనిటీ సెంటర్లలోకి తరలిస్తున్నట్లు తెలిపారు.

GHMC clearing the debris buildings in Hyderabad
శిథిల భవనాల కూల్చివేతకు సహకరించాలి:లోకేశ్​కుమార్​
author img

By

Published : Jun 20, 2020, 3:06 PM IST

హైదరాబాద్​లో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చి వేసేందుకు ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ కోరారు. నగరంలోని అన్ని సర్కిళ్లలో శిథిల భవనాల తొలగింపు కోసం నేటి నుంచి బల్దియా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ సందర్భంగా నగరంలోని అన్ని సర్కిళ్లలో గుర్తించిన శిథిల భవనాలను కూల్చివేస్తున్నట్లు లోకేశ్​కుమార్​ పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలను నివారించి.. ప్రజలను రక్షించేందుకే వీటిని తొలగిస్తున్నామని తెలిపారు. కూల్చివేతల్లో నిరాశ్రయులైన వారిని కమ్యూనిటీ సెంటర్లలోకి తరలిస్తున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జరుగుతోన్న పనులకు నగరవాసులు సహకరించాలని కోరారు.

శిథిల భవనాల కూల్చివేతకు సహకరించాలి:లోకేశ్​కుమార్​

ఇదీచూడండి: ఆ యాప్​తో సొంతూళ్లలోనే వలస కూలీలకు ఉపాధి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.