ETV Bharat / state

నిలకడగానే అచ్చెన్నాయుడి ఆరోగ్యం: జీజీహెచ్ వైద్యులు

author img

By

Published : Jun 13, 2020, 2:17 PM IST

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

నిలకడగానే అచ్చెన్నాయుడి ఆరోగ్యం: జీజీహెచ్ వైద్యులు
నిలకడగానే అచ్చెన్నాయుడి ఆరోగ్యం: జీజీహెచ్ వైద్యులు

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ స్పందించారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఈ నెల 11న అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగిందని... మరుసటి రోజే వాహనంలో ఎక్కువసేపు ప్రయాణించటం వల్ల గాయం కాస్త పెరిగిందని ఆయన వెల్లడించారు. 2, 3 రోజుల్లో నయమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్‌ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావచ్చని చెప్పారు. 99 శాతం మేరకు మళ్లీ ఆపరేషన్ అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ అభిప్రాయపడ్డారు.

అచ్చెన్నాయుడు మూల వ్యాధి సంబంధిత ‘పెరీయానల్‌ ఆబ్సెస్‌’తో బాధపడుతున్నారు. ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు ప్యాడ్‌ వేసి ఆ రోజు రాత్రి ఇంటికి పంపించారు. 12న ఉదయం ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి

ఈఎస్​ఐ కేసులో మరొకరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.