రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో మాక్స్, విజన్ డెంటల్ ఆస్పత్రుల సంయుక్త ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
పోలీసులు విధినిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారని ప్రతి ఒక్కరు వైద్య శిబిరంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. గుండె, రక్తపోటుకు వంటి తదితర వ్యాధులను నియంత్రణలో ఉంచడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని.. రోజూ గంట పాటు వ్యాయామం చేయాలన్నారు.
పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎవరైనా ఆత్మహత్య, యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరిగితే వాటికి వెంటనే స్పందించి బాధితుల ప్రాణాలు కాపాడిన పోలీసులను సీపీ అభినందించారు.
ఇదీ చూడండి: ఆరోగ్య తెలంగాణను తయారు చేసుకుందాం'