ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల జాతీయ రహదారిపై విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మాణంలో వున్న వంతెనను.. అదుపు తప్పిన బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించాడు. ప్రమాదాన్ని తప్పించేలా.. బస్సును ఆపగలిగాడు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారు. టోల్ గేటు సిబ్బంది సహకారంతో బస్సు ను బయట లాగారు. ప్రయాణికులను మరో బస్సులో సురక్షితంగా గమ్యస్థానానికి పంపించారు.
ఇదీ చదవండి: