వరంగల్ జిల్లాకు చెందిన వరుణ్ తేజా, ఖమ్మం జిల్లాకు చెందిన అభిషేక్ జేఎన్టీయూహెచ్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరికి కళాశాలలో ఉత్తమ విద్యార్థులుగా పేరు ఉంది. కొద్దిరోజుల నుంచి వారిలో భారీ మార్పు వచ్చింది. అందుకు గంజాయికి అలవాటు పడ్డటమే కారణం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేజీ రూ. 4వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ శివారులోని కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. అందులో కేజీకి రూ.20వేలు చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా వీరు రెండేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. హబ్సిగూడలోని సీసీఎంబీ వద్ద ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్ముతుండగా ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రెండు కేజీల గంజాయి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!... ఆమె 6 నెలల గర్భవతి