Gangula kamalakar comments: సీఎం కేసీఆర్ కుటుంబానికి తాను ఆత్మాహుతి దళసభ్యునిగా ఉంటానని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తనకు పదవులు శాశ్వతం కాదని పేర్కొన్నారు. కరీంనగర్ పట్టణప్రగతిలో పాల్గొన్న మంత్రి రాంనగర్ మార్కెట్ ఆధునీకరణ పనులకు భూమి పూజచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతోనే దేశవ్యాప్త చర్చ మొదలైందని ఇక్కడ జరుగుతున్న అభివృద్ది తమ ప్రాంతాల్లోను జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ?ఎంపీగా పోటీ చేస్తారా అన్నప్రశ్నకు కేసీఆర్ ఎలా ఆదేశిస్తే అలా చేస్తానని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ గారికి సూసైడ్ స్వ్కాడ్‌ని నేను... మళ్లీ మళ్లీ 100 సార్లు చెబుతున్నా.. ఆయనకు, ఆయన కుటుంబానికి నేను సూసైడ్‌స్క్వాడ్‌ను.. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, రాజకీయం నాకు శాశ్వతం కాదు.. కేసీఆర్ అభిమానం నాకు శాశ్వతం. కేసీఆర్ ఏది ఆదేశిస్తే.. అది తూ.చ తప్పకుండా చేస్తా... రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా... నేను ఆయన వెంబడి ఉంటా...కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం. కేసీఆర్ జాతీయా రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. - గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి
ఇవీ చూడండి: