ETV Bharat / state

జైలు నుంచి విడుదలైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ - Ayub Khan released from Chanchalguda jail

నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టయిన హైదరాబాద్​ పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్ట్​ కేసులో 2017లో అతడిని ముంబయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.

చంచల్‌గూడ జైలు
చంచల్‌గూడ జైలు
author img

By

Published : Sep 7, 2022, 12:54 PM IST

నకిలీ పాస్‌పోర్ట్​ కేసులో అరెస్టయిన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్ట్​తో సౌదీ అరేబియా నుంచి వచ్చాడనే కారణంతో 2017లో అతడిని ముంబయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం అయూబ్‌ను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

అయూబ్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా.. సుమారు ఐదేళ్లుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అతడిపై పాతబస్తీ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2010లో హైదరాబాద్‌లోని గోల్కొండ చిరునామాతో నకిలీ పాస్‌పోర్టును అయూబ్‌ఖాన్‌ తీసుకున్నాడు. దీనికి సహకరించిన అతడి భార్య హఫీజా బేగం, మరో ఇద్దరు ఖాజీలను కాలాపత్తర్‌ పోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.