ETV Bharat / state

'గంగపుత్రులకు మంత్రి తలసాని క్షమాపణలు చెప్పాలి' - Hyderabad latest news

మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకొని.. గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్​లో గంగపుత్ర సంఘం సమావేశం నిర్వహించారు.

Talasani demanded an apology to the Gangaputras
గంగపుత్రులకు తలసాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్
author img

By

Published : Jan 16, 2021, 7:09 PM IST

తెలంగాణలో గంగపుత్ర కులాన్ని లేకుండా చేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆ సంఘం కన్వీనర్ బిజ్జ లక్ష్మణ్ ఆరోపించారు. తమ కులాన్ని భూస్థాపితం చేసి మరో సామాజిక వర్గానికి మేలు చేసేలా మంత్రులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఏం చేయాలి..

చెరువులపై ముదిరాజులకు హక్కు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్​లో సమావేశం నిర్వహించారు. కులవృత్తిగా చేపలు పడుతున్న గంగపుత్రులు ఏం పని చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ సామాజికవర్గానికి మేలు చేసేందుకు మరొకరిని అణిచివేయడం భావ్యం కాదని విమర్శించారు.

స్పందన లేదు..

కులాల మధ్య మంత్రులు విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తలసాని తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గంగపుత్రులకు తలసాని క్షమాపణ చెప్పాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా సంఘటితమవుతాం. హైదరాబాద్​లో భారీ బహిరంగ సభ పెడతాం. రాజధాన్ని దిగ్భందిస్తాం.

-గంగపుత్ర సంఘం

ఇదీ చూడండి: ప్రొటోకాల్ లొల్లి... భాజాపా, తెరాస బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.