ETV Bharat / state

'కల్లెడ గంగాధర్​ మిస్సింగ్​ కేసును త్వరగా ఛేదించండి'

యూఏఈ నుంచి హైదరాబాద్​కు వచ్చి హోటల్లో క్వారంటైన్​లో ఉండి తప్పిపోయిన కల్లెడ గంగాధర్ గురించి ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్​కు బెస్తగూండ్ల గంగపుత్ర చైతన్య సమితి నాయకులు విన్నవించారు. స్పందించిన ఆయన దర్యాప్తును ముమ్మరం చేయాలని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్​ అథారిటీ పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్​కు ఫోన్​లో సూచించారు.

GANGAPUTHRA LEADERS MEET MLA MUTA GOPAL
'కల్లెడ గంగాధర్​ మిస్సింగ్​ కేసును త్వరగా ఛేదించండి'
author img

By

Published : Jul 28, 2020, 9:40 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రీ గ్రామంలో గంగపుత్రుల సామాజిక బహిష్కరణపై బెస్తగూండ్ల గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు పూస సత్యనారాయణ బెస్త హైదరాబాద్​ ముషీరాబాద్​ శాసన సభ్యుడు ముఠా గోపాల్​ను కలిశారు. స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఫోన్​ చేసి మాట్లాడారు. పిప్రీ గ్రామ గంగపుత్రుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన్ను ముఠా గోపాల్ కోరారు.

ఈ సమస్యపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి, సమస్యను అతిత్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 18వ తేదీన యూఏఈ నుంచి హైదరాబాద్ చేరుకొని ఒక హోటల్లో క్వారంటైన్​లో ఉండి, తప్పిపోయిన కల్లెడ గంగాధర్ గురించి ఎమ్మెల్యేకు గంగపుత్ర సమితి సభ్యులు విన్నవించారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్​ అథారిటీ పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్​కు ఎమ్మెల్యే​ ఫోన్ చేసి దర్యాప్తును ముమ్మరం చేయాలని సూచించారు. వీలైనంత తొందరగా కల్లెడ గంగాధర్ గంగపుత్ర ఆచూకీ కనిపెట్టాలని కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.