Consultancy Cheating Rs 10 Crores In Hyderabad : పెట్టుబడుల పేరుతో.. అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.10 కోట్ల మోసానికి పాల్పడిన ముగ్గురి సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. క్సిటో కన్సల్టెన్సీ సంస్థ ఏర్పాటు చేసి సుమారు 500 మంది బాధితులను మోసం చేసి.. మోసాలకు తెర లేపారని పోలీసులు గుర్తించారు. కేపీహెచ్‌బీ పోలీస్ సేష్టన్‌లో ఓ బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేసింది. మెదటిగా ఈ సంస్థ 2015లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత తమ మకాంను హైదరాబాద్‌లో సైతం ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 500మంది బాధితులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.10కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపారు.
బాధితులు నగదును వివిధ మార్గాల్లో ఆ సంస్థ బ్యాంక్ ఖాతాలోకి జమ చేశారని పోలీసులు వివరించారు. జమ చేసిన నగదుకు 3 నెలలకు 1:1, 1 సంవత్సరానికి 1:4 లాభాలను తిరిగి చెల్లిస్తామని బాధితులకు ఆశ చూపారని వెల్లడించారు. రాజేంద్రప్రసాద్, వెంకట్ ప్రసాద్, చలపతిలను అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. వాళ్లను కూడా త్వరలో పట్టుకుంటామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. తమ దగ్గర తీసుకున్న నగదును ఇప్పించాలని.. బాధితులు కోరుతున్నారు.
నల్గొండ జిల్లాలో దొంగతనానికి పాల్పతున్న 6గురు సభ్యుల ముఠా అరెస్ట్ : నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ. 32 లక్షలు విలువ చేసే 51 తులాల 9 గ్రాముల బంగారం, 34 తులాల వెండి, 3 ద్విచక్ర వాహనాలు, 2 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని.. ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈనెల 25న నల్గొండలోని పానగల్ బైపాస్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమాన్పదంగా ఓ వ్యక్తి పట్టుబడటంతో.. ఆవ్యక్తిని విచారించగా తనతో పాటు మరో 5గురు సభ్యుల ముఠా ఉన్నట్లు వెల్లడించడంతో మరికొందరి పట్టుకొని విచారించి రిమాండ్‌కు తరలించిట్లు పోలీసులు వివరించారు.
ఇవీ చదవండి :