హైదరాబాద్‌లో జరిగే గణేష్ నిమజ్జనానికి ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్, హరిద్వార్‌కు చెందిన ప్రాగ్యానంద్ మహరాజ్ హాజరవుతున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంత్ రావు తెలిపారు. ఇరువురు నేతలు ఇచ్చే సందేశాన్ని ప్రజల అందరూ వీక్షించే విధంగా నగరంలో 12 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బాహేతి భవన్‌లో సామూహిక గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. సీపీ అంజనీ కుమార్, రవాణా శాఖ సంయుక్త కమిషనర్ పాండురంగ నాయక్‌తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ శాఖ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగ నాయక్ వివరించారు.
గణేశ్నిమజ్జనానికి రానున్న ఆరెస్సెస్ అధినేత - immersed
హైదరాబాద్‌లో జరగనున్న గణేశ్ నిమజ్జనానికి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, ప్రాగ్యానంద్ మహరాజ్ వస్తున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది.