ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్... కనిపించని వినాయక నిమజ్జన సందడి - Ganesh immersion

హైదరాబాద్​ కూకట్​పల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఏటా భారీగా నిమజ్జనం జరిగే ఐడియల్​ చెరువు వద్ద ఈసారి కోలాహలం కనిపించలేదు. చుట్టుపక్కల ప్రజలు కొందరు ఆశగా చూసేందుకు వచ్చినప్పటికీ గణనాథుల కోలాహలం భారీ గణపతుల సందడి లేదు.

Ganesh immersion at KukatPalli, hyderabad
కనిపించని వినాయక నిమజ్జన కోలాహలం
author img

By

Published : Sep 2, 2020, 7:54 AM IST

గణేశ్ నవరాత్రుల అనంతరం కూకట్​పల్లిలో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. కొవిడ్​ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు చాలా కాలనీల్లో భారీ వినాయకులను ఏర్పాటు చేయకుండా చిన్న చిన్న గణపతులను ఏర్పాటు చేసుకుని నిమజ్జనం చేశారు.

దీనితో ఏటా భారీగా నిమజ్జనం జరిగే ఐడియల్​ చెరువు వద్ద ఈసారి కోలాహలం కనిపించలేదు. చుట్టుపక్కల ప్రజలు కొందరు ఆశగా చూసేందుకు వచ్చినప్పటికీ గణనాథుల కోలాహలం భారీ గణపతుల సందడి లేదు. గణనాథుల విగ్రహాలు ఎక్కువగానే ఉండొచ్చని 2 భారీ క్రేన్లను, జేసీబీని ఏర్పాటు చేసినప్పటికీ ఊహించినంత మేర విగ్రహాలు నిమజ్జనానికి రాలేదు. ఏదేమైనా ప్రభుత్వ ఇచ్చిన సూచనలు ప్రజలు పాటించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.