Ganesh Festival 2023 : గణేశ్ చతుర్ది.. ప్రజలకు ఆనందాన్నే కాదు... ఆరోగ్యాన్ని పంచే పండుగ. పర్యావరణ పరిరక్షణ పరమార్థాన్ని చాటుతూ ఏటా ప్రజలను మేల్కొలుపుతుంటుంది ఈ పండుగ. చుట్టూ ఉండే ప్రకృతిని, సహజవనరులను పరిరక్షించుకుందామని పిలుపునిచ్చే ఈ పండుగ.. పల్లె నుంచి పట్నం వరకు ఎంతో జోరుగా సాగుతుంటుంది. కొందరు తొమ్మిదిరోజులు మరికొందరు 11 రోజులు బొజ్జ గణపయ్యను నిత్యపూజలతో (Ganesh Festival 2023) ఆరాధిస్తుంటారు. అయితే ఆ ఆరాధన.. గ్రామీణ ప్రాంతాల్లోని కులవృత్తులకు చేయూత నివ్వాలంటున్నారు... బాధ్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడిమర్రి చంద్రశేఖర్. పండుగ పైసలు పల్లెలలకు ఇద్దామని పిలుపునిస్తూ పట్టణ వాసులను మేల్కొలుపుతుంటారు. చవితి పండుగ కోసం కొనుగోలు చేసే వినాయక ప్రతిమలను కుమ్మరుల వద్ద, పూజ కోసం ఉపయోగించే వస్త్రాలను నేతన్నల వద్ద కొనుగోలు చేసి ఆసరాగా ఉందమని పిలుపునిస్తున్నారు.
"గ్రామాలు పట్టుకొమ్మలని అందరికి తెలుసు. పండగ రోజు పట్నం డబ్బులు పల్లెకి ఇచ్చి పుణ్యం చేసుకుందాం అనే నినాదంతో గ్రామప్రజలకు ఆదాయ మార్గాన్ని చూపించాలి అని ఇది మొదలు పెట్చాను. ఇంటర్నెట్లో కొనుగోలు చేస్తే కార్పొరేట్‌కి ఆదాయం వెళుతుంది. అలా ఎందుకు పల్లెవారికి ఆదాయాలు రావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. 2014 నుంచి ఈ నినాదాన్ని మేను పాటిస్తున్నాము." - పైడిమర్రి చంద్రశేఖర్, వ్యవస్థాపకుడు బాధ్యత ఫౌండేషన్
Badhyatha Foundation: మాటల్లో కాదు ఆచరణలోనూ చంద్రశేఖర్ (Badhyatha Foundation)అమలు చేసి చూపిస్తున్నారు. తన బాధ్యత ఫౌండేషన్ ద్వారా సుమారు 22 గ్రామాల నుంచి 9 ఏళ్లుగా 33 రకాల పూజా వస్తువులు, 21 రకాల పత్రిలను సేకరించి పట్టణ ప్రజలకు అందిస్తున్నారు. తద్వారా ఆయా గ్రామాల్లోని కులవృత్తిదారులు, మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు.
Prathidwani : ఏకదంతుడి పుట్టినరోజుని.. పర్యావరణహితంగా జరుపుకోవడం ఎలా..?
పల్లె నుంచి పట్టణానికి రాబడి పెరిగిన దశలో.. ఇప్పుడు పట్టణం నుంచి పల్లెకు ఆదాయం వచ్చేలా కృషి చేద్దామంటోన్న చంద్రశేఖర్... చవితి పూజకు కావల్సిన 21 పత్రాలతో కూడిన పూజా సామ్రాగి కిట్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు హైదరాబాద్ నగరంలోని 52 ప్రాంతాల్లో బాధ్యాత ఫౌండేషన్ ద్వారా ఆ కిట్లను పట్టణవాసులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
అంతేకాకుండా చవితి పూజలో ఎంతో పవిత్రంగా భావించే 21 రకాల పత్రిలపై తన నివాసంలోని పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా పిల్లల్లో పండుగ విశిష్టతోపాటు ప్రకృతి పట్ల ఆరాధన భావం కలుగుతుందని చంద్రశేఖర్ (Ganesh Festival Celebrations 2023) చెబుతున్నారు. ప్రకృతికి, మనిషికి మధ్య అనుబంధాన్ని పెంచే ఇలాంటి పండుగల సమయంలో మనిషికి మనిషి తోడుగా నిలువడం ఎంతో ముఖ్యమంటోన్న చంద్రశేఖర్... పర్యావరణ పరిరక్షణ పట్ల తనవంతు బాధ్యతను చాటుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గోల్డెన్ టెంపుల్ గణేశుడికి రూ.8 కోట్ల బంగారు కిరీటం.. ఎంత ముచ్చటగా ఉందో!