Ganesh Chaturthi Telangana 2023 : విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజకు రాష్ట్రం సిద్ధమైంది. గతానికి భిన్నంగా వినాయక చవితి(Vinayaka Chavithi 2023) వేడుకలను జరుపుకోవడంపై ఓరుగల్లులోని నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటిలోని జీవరాశులకు ముప్పువాటిల్లుతుందంటూ.. మట్టి వినాయకుల్ని పూజించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
Vinayaka Chavithi Celebrations in Telangana 2023 : మట్టి గణపయ్యకు ఆదరణ పెరగడంతో విగ్రహాల తయారీదారులు విభిన్న ఆకృతులలో బొజ్జ గణపయ్యలను తీర్చిదిద్దారు. సహజసిద్ధమైన రంగులను ఉపయోగిస్తూ పీఓపీ విగ్రహాలకు ధీటుగా అందంగా అలంకరించారు. బీఆర్ఎస్ నాయకుల అభిరుచి మేరకు.. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పూజ చేస్తున్నట్లుగా గణనాథున్ని తయారు చేశారు.
"పీఓపీ గణేశ్ విగ్రహాల వాడకంతో పర్యావరణం చాలా వరకు దెబ్బతింటుంది. ఆ ఆలోచనతోనే మా యూత్ తరపున చాలా ఏళ్లుగా మట్టి ప్రతిమలనే కొని, వేడుకలను ఘనంగా జరుపుకుంటుంటాం. సహజ రంగుల అద్దకాలతో గణనాథుని మట్టి బొమ్మలు పీఓపీ విగ్రహాలు కంటే ఎంతో అందంగా ఉన్నాయి. అందరూ కూడా ఇదేవిధంగా మట్టి విగ్రహాలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం." - కొనుగోలుదారులు
నగరమంతా గణపతి శోభ.. ఆకట్టుకుంటున్న కార్తికేయ-2 మండపం
Eco Friendly Ganesh in Telangana : సామగ్రి దుకాణాల వద్ద జనం బారులు తీరారు. మట్టి గణపతులను కొనేందుకే స్థానికులు ఆసక్తి కనబరచడంతో ప్రధాన కూడళ్లలో రద్దీ నెలకొంది. నాగార్జున సాగర్(Nagarjuna Sagar) పరిధిలో బుసిరెడ్డి ఫౌండేషన్ ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కొన్ని కుటుంబాలు వృత్తిరీత్యా ఏళ్ల తరబడి మట్టి వినాయక ప్రతిమలను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
చవితికి 20 రోజుల ముందు నుంచే మట్టి ప్రతిమల తయారీలో నిమగ్నమై.. సహజ సిద్ధమైన రంగులతో నిర్వాహకులు ఆకట్టుకునేలా ప్రతిమలు తయారు చేస్తున్నారు. ఇలా గత 30 ఏళ్ల నుంచి ఈ కుటుంబాల వారు మట్టి గణేశుని ప్రతిమలు తయారు చేస్తూ తక్కువ ధరకే ప్రజలకు అందిస్తూ భక్తితో పాటు ఉన్న చోటే ఉపాధిని పొందుతూ సంతోషంగా ఉంటున్నామని అంటున్నారు. మట్టి వినాయకుడిని తయారు చేసి తమవంతు కృషిగా పర్యావరణాన్ని కాపాడుతున్నామని అభిప్రాయపడ్డారు. చాలాచోట్ల ఊరేగింపుగా వినాయక విగ్రహాలను తీసుకెళ్లారు.
పురాతన మట్టి విగ్రహం : నారాయణపేట జిల్లా పరిమళపురంలో విద్యాధర్ దీక్షిత్ నివాసంలో సుమారు 800 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మట్టిగణపతి విగ్రహాన్ని ఇప్పటివరకు నిమజ్జనం చేయలేదు. ఆ విగ్రహాన్ని చూసేందుకు వివిధ చోట్ల నుంచి భక్తులు వస్తుంటారని వారి కుటుంబీకులు తెలిపారు.
Ganesh Chaturthi 2023 : మానవ కోటికి వినాయక చవితి చాటి చెప్పే సందేశం ఏమిటి?
Khairatabad Ganesh 2023 : శ్రీదశ మహావిద్యాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనం.. మొదలైన భక్తుల కోలాహలం..