మంగళవారం రాత్రి గుండె సమస్యతో రెండు నెలల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాబు తరపు బంధువులు ఐసీయూలోకి చొచ్చుకెళ్లి వైద్యుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందించ లేదని తెలిపారు.
ఇవీ చూడండి:డాక్టర్ కాముడు
'చర్చలు' విఫలం
సమస్యను పరిష్కరించేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇవాళ జూడాలతో చర్చలు జరిపినా ఫలప్రదం కాలేదు. దాడి జరుగుతున్న సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీఎం చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే తమకు లిఖిత పూర్వక హామీ కావాలని జూడాలు పట్టుబడుతున్నారు. వైద్యశాఖ మంత్రి స్వయంగా గాంధీకి వచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
తమకు న్యాయం జరిగే వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని జూడాలు హెచ్చరిస్తున్నారు.