ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారుతున్న నేపథ్యంలో.... ప్రజల్లో నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అందులో భాగంగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు కొన్ని వీడియోలను విడుదల చేసింది. గాంధీలో సరైన సమయానికి మంచి ఆహారం, వైద్యం అందిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... తల్లడిల్లుతున్న తెలంగాణ