మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలు, 73వ స్వాత్రంత్ర దినోత్సవం సందర్భంగా రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'మన మహాత్ముడు' పేరుతో ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పార్రంభించారు.
గాంధీజీ చదివిన పాఠశాల, చంపారన్ సత్యాగ్రహం, ఎరవాడ జైలు, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు ప్రదర్శించారు. యువతీయువకులు, ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. నేటి నుంచి 4 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ ప్రాముఖ్యతను తెలిపే 50కి పైగా చిత్రాలు అందుబాటులో ఉంచారని కిషన్ రెడ్డి అన్నారు.
ఇవీ చూడండి: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అతిథుల పేర్లు ఖరారు