హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నేటి నుంచి పునః ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో మామిడి, బత్తాయి క్రయవిక్రయాలు నిర్వహించేందుకు నిర్ణయించి సోమవారం రాత్రి నుంచే యార్డులోకి మామిడి, బత్తాయి దిగుమతులను అనుమతించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడానికి వీలుగా లారీల్లోని దిగుబడులను ప్లాట్‌ఫాంలపై అన్‌లోడ్ చేయకుండానే వేలం పాటలు నిర్వహించి విక్రయించనున్నారు. రైతులందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కమిటీ సభ్యులు కోరారు.
ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!