కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ వలస కార్మికులను ఆదుకోడానికి కొందరు తమ వంతు బాధ్యతగా ముందుకొస్తున్నారు. నిత్యావసర సరకులు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలతో, పాటు భవన నిర్మాణ కార్మికులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ సాయిబాబా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
సుమారు రెండొందల మందికి ఒక్కొక్కరికీ ఐదు కేజీల బియ్యం, రెండు కేజీల గోధమ పిండి, నూనె ప్యాకెట్ ఇచ్చారు. ఆదపకాల సమయంలో తమ వంతు బాధ్యతగా అభాగ్యులకు అండగా ఉండాలని కొర్పొరేటర్ సాయిబాబా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుపై పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు