ETV Bharat / state

Narendra Singh Tomar Latest Comments : 'ఆ సవాళ్లను అధిగమించేందుకు జీ-20 దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధం' - G20 agriculture ministers Meet in Hyderabad

G-20 Agriculture Meeting in Hyderabad : హైదరాబాద్ ​వేదికగా ప్రతిష్ఠాత్మక జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయరంగం సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఆహార భద్రత, పోషకాహార భద్రతపై చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.

Narendra Singh Tomar
Narendra Singh Tomar
author img

By

Published : Jun 15, 2023, 5:45 PM IST

Updated : Jun 15, 2023, 7:01 PM IST

G-20 Agriculture Ministers Meeting in Hyderabad : హైదరాబాద్ వేదికగా జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. భారత్‌ సహా జీ-20 సభ్య దేశాల పలువురు వ్యవసాయ శాఖ మంత్రులు, అంతర్జాతీయ పరిశోధన సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, నిపుణులు 200 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ చెబుతున్న "వసుదైవ కుటుంబం" అనే థీమ్‌లో భాగంగా.. ప్రపంచంలో అనూహ్య వాతావరణ మార్పులు, ఆహార భద్రత, పోషణ, విలువ గొలుసు, ఆహార వ్యవస్థలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. కీలక వ్యవసాయ పరివర్తన, ఆకర్షణీయ వ్యాపార ధోరణిలో సేద్యం కోసం డిజిటలైజేషన్‌, వినూత్న సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విజ్ఞానం, ఆహార శుద్ధి, రవాణా, మార్కెటింగ్ అంశాలపై చర్చలు జరుపుతున్నారు.

G20 agriculture ministers Summit in Hyderabad : ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన -2023ను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి ప్రారంభించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలు ప్రదర్శించేలా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కైలాష్​చౌదరి పరిశీలించారు. వ్యవసాయ యాంత్రీకరణ, పరికరాలు, పరిశోధనా, అభివృద్ధిపై ప్రదర్శన ఆకట్టుకుంటోంది.

Narendra Singh Tomar on G20 agriculture meeting : వ్యవసాయంలో వివిధ రంగాలలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడానికి జీ20 దేశాలతో కలిసి పని చేసేందుకు.. భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. హైదరాబాద్ వేదికగా జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కీలక సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆయన వివరించారు.

అనూహ్య వాతావరణ మార్పల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేకించి భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నామని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహార భద్రత, పోషకాహార భద్రతపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తి.. ఉత్పాదకత పెంపుపై చర్చిస్తున్నట్లు నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో అన్నదాతల ఆదాయాలు పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందని నరేంద్ర సింగ్ తోమర్ వివరించారు. ప్రత్యేకంగా చిన్న, సన్నకారు రైతుల బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో సేంద్రీయ, సహజ వ్యవసాయం ప్రోత్సహిస్తున్నామని.. సేంద్రీయ రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెటింగ్ లింకేజీ కల్పించినట్లు నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు కైలాష్ చౌదరి, శోభా కరంద్లాజే, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా తదితరులు పాల్గొన్నారు.

"వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయరంగంలో సవాళ్లపై చర్చిస్తున్నాం. వ్యవసాయం రంగంలోని సవాళ్లకు పరిష్కారాలపై చర్చిస్తున్నాం. ఆహార భద్రత, పోషకాహార భద్రతపై చర్చిస్తున్నాం. వ్యవసాయం, ఉద్యాన పంటల ఉత్పాదకత పెంపుపై చర్చలు జరుపుతున్నాం. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోంది. దేశంలో సేంద్రీయ, సహజ వ్యవసాయం ప్రోత్సహిస్తున్నాం." - నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

ఇవీ చదవండి: జీ20 సదస్సులో రామ్​చరణ్​ సందడి.. వాళ్లతో 'నాటు నాటు' స్టెప్పులు.. తొలిరోజు పూర్తి

భారత్​కు జీ20 అధ్యక్ష పగ్గాలు.. వసుధైక కుటుంబమనే భావనతో 2023 సదస్సు!

Last Updated : Jun 15, 2023, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.