ETV Bharat / state

IIT HYDERABAD: చిట్టి బుర్రలో.. వినూత్న ఆలోచనలు

Future Innovators Fair at IIT HYD: భవిష్యత్‌ పరిశోధకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో.. పాఠశాల విద్యార్థుల కోసం ఐఐటీ హైదరాబాద్ 'ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫెయిర్‌' నిర్వహించింది. ఈ ఈవెంట్​లో భాగంగా చిన్నారుల ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఉత్తమమైన ఆలోచనల్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి ఐఐటీ హైదరాబాద్‌ సహాయ సహకారాలు అందించనుంది.

Future Innovators Fair at IIT Hyderabad
ఐఐటీ హైదరాబాద్​లో ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫేయిర్‌
author img

By

Published : Apr 14, 2023, 1:50 PM IST

ఐఐటీ హైదరాబాద్​లో ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫేయిర్‌ కార్యక్రమం

Future Innovators Fair at IIT HYD: ఇన్వెంటింగ్.. ఇన్నోవేటింగ్.. ఇన్‌టెక్నాలజీ ఫర్ హ్యూమానిటీ అనే మూడు సూత్రాలతో ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణలకు చిరునామాగా నిలుస్తోంది. పాఠశాల దశ నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించేలా.. 'ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫేయిర్‌' చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి 130కి పైగా ఆలోచనలు వచ్చాయి. వాటిల నుంచి అత్యుత్తమమైనవి 22 ఎంపిక చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయికి ప్రదర్శనను విస్తరిస్తామని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి స్పష్టం చేశారు.

సౌర విద్యుత్​తో సులువుగా పాత్రలను శుభ్రం చేసే పరికరం: పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహకులు పెద్ద పెద్ద పాత్రలను కడగడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇస్సాయిపేట జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సాకేత్‌ దృష్టిలో పడ్డాయి. అ సమస్యకు పరిష్కారంగా సోలార్ కమ్ హ్యాండ్ డిష్ వాషర్ ఆలోచన పుట్టుకొచ్చింది. సౌర విద్యుత్‌తో సులువుగా పాత్రలను శుభ్రపరిచే పరికరాన్ని రూపొందించాడు. బోడుప్పల్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు పర్యావరణ హిత శానిటరీ న్యాపికిన్స్ రూపొందించారు.

అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే వ్యవస్థ: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కి చెందిన విద్యార్థి సూరజ్.. మిత్రులతో కలిసి అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడే వ్యవస్థను రూపొందించాడు. ఆ పరికరం సెన్సార్ల ఆధారంగా మంటలను ఆర్పుతుంది. కల్వర్టుల వద్ద రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ సహకారంతో మహ్మద్ అనే విద్యార్థి పరిష్కారం చూపాడు.

తాత కష్టం చూడలేక చేతికర్ర రూపొందించిన విద్యార్థి: ఇంథిజన్ అనే విద్యార్థి తన తాతయ్య ఎదుర్కొన్న ఇబ్బందులు మరొకరు పడొద్దన్న ఉద్దేశంతో.. ఓల్డ్ మ్యాన్ ఫ్రెండ్లీ స్టిక్ పేరుతో చేతికర్ర రూపొందించాడు. సెన్సార్లు, టార్చిలైట్‌తో పాటు వెస్ట్రన్ తరహా టాయిలెట్ ప్లేట్‌ను అమర్చాడు. రామన్నెగూడం జిల్లా పరిషత్ పాఠశాలలో చదివే రక్షిత.. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఉండేలా రోడ్డు ప్యాచ్​ని రూపొందించింది.

"పాఠశాల్లో కొత్త ఆలోచనలు వచ్చే విద్యార్థులు చాలా మంది ఉంటారు. వాళ్లను ఆ వయస్సు నుంచే ప్రోత్సహించాలనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కరోనా వ్యాక్సిన్​ కనుగొన్న కృష్ణ ఎల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ఉత్తయ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయనున్నాం. చిన్న వయస్సు నుంచే వినూత్న ఆలోచన ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు మా వంతు కృషి చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం."- బీఎస్ మూర్తి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.