అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి.. హైదరాబాద్ తార్నాకలోని మాణికేశ్వర నగర్లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రామజన్మ భూమి ట్రస్ట్ ఓయూ ఇన్ఛార్జ్ డా. అనంత శంకర్, భాజపా నాయకురాలు అమృత ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏ పనైనా విజయవంతమవుతుందని డా. అనంత శంకర్ పేర్కొన్నారు. విరాళాలు ఇవ్వడానికి భక్తులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: అయోధ్య రామమందిరానికి హైదరాబాదీ ముస్లిం భారీ విరాళం