ఉపాధ్యాయ సంఘాల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో శాసనసభలోకి వెళ్లే ప్రవేశ ద్వారాల వద్ద తనిఖీలను పోలీసులు విస్తృతం చేశారు. అసెంబ్లీ మూడో ద్వారం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు... గుర్తింపు కార్డు ఉన్నవారినే లోనికి అనుమతిస్తున్నారు.
శాంతిభద్రతల పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులు, ఇతర అదనపు బలగాలను పెద్ద సంఖ్యలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో మోహరించారు. శాసనసభకు వచ్చే దారులన్నింటిలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ వచ్చిన సమయంలో ఉత్పన్నమైన ఘటనను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను సైతం తనిఖీలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్